టాలీవుడ్ చలన చిత్ర రంగంలో విలక్షణ నటుడిగా డాక్టర్ మోహన్‌బాబు (Mohan Babu) కు ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. ఆయన ఇప్పుడు కాస్త ఇబ్బందిలో పడ్డట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నో వివాదాలు ఆయన్ను చుట్టు ముట్టినా ఆయన మాత్రం వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడు ఆయన ఓ విషయంలో ఏకంగా క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
తనపై కావాలనే కొందరు యూట్యూబ్‌లో టార్గెట్ చేసి మరీ ట్రోలింగ్ చేస్తున్నారంటూ లీగల్ అడ్వైజర్ సైబర్ క్రైమ్ పోలీసులకు నటుడు మోహన్‌బాబు తీసుకెళ్లారని తెలుస్తోంది. కావాలనే సోషల్ మీడియాలో తనపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని మోహన్ బాబు మండిపడ్డారు.
తనపై ఎవరో కావాలనే బూతులను కామెంట్స్ రూపంలో పెట్టిస్తూ వైరల్ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పొలిటికల్ మోజో అనే పేరుతో ఉండే యూట్యూబ్ ఛానెల్ వారు తనను కావాలనే ఇలా ఇబ్బంది పెడుతున్నారని, వీడియోల రూపంలో బూతులు తిడుతూ తనపై నిందలు మోపుతున్నారంటూ ఆయన పోలీసులకు వివరించారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.