వైఎస్ జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం.. ఏపీలో బార్ ల సంఖ్య 40 శాతం తగ్గింపు..

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జ‌గ‌న్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. మద్యపాన నియంత్రణ, నిషేధాన్ని అమలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడున్న బార్ల సంఖ్యలో 40 శాతం తగ్గించాలని నిశ్చయించారు. ఇవాళ(మంగళవారం) బార్ల విధానంపై సీఎం అధికారులతో సమీక్షించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా బార్ల విషయంలో ఇప్పటివరకు తీసుకుంటున్న చర్యలను, ఇకపై తీసుకోవాల్సిన చర్యలపై ఆయన అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో ఉన్న 797 బార్లలో 40 శాతం తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. వీటికి కొత్తగా లైసెన్స్‌లు జారీచేయడంతోపాటు, లాటరీ పద్ధతిలో బార్లను కేటాయించాలని నిర్ణయించారు. అలాగే విక్రయ వేళల్లో కూడా మార్పులు చేశారు. బార్లలో ఉదయం 11 నుంచి రాత్రి 10వరకూ మద్యం సరఫరాను అనుమతిస్తారు, స్టార్‌ హోటళ్లలో ఉదయం 11 నుంచి రాత్రి 11 వరకూ మద్యాన్ని విక్రయించడానికి అనుమతి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news