విభిన్న పాత్రల్లో విక్రమ్‌.. ఆసక్తిగా ‘కోబ్రా’ టీజర్‌

-

కోలీవుడ్ స్టార్ హీరో ‘చియాన్’ విక్రమ్..నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సరైన పాత్ర దొరికితే తనలోని నట విశ్వరూపం చూపించేస్తారు ఈ వెర్సటైల్ యాక్టర్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘కోబ్రా’. మ్యూజిక్ లెజెండ్ ఏ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, తాజాగా ఈ మూవీ తెలుగు టీజర్ ను రిలీజ్ చేస్తుంది.

ఇందులో ‘కోబ్రా, లెక్కలతో నేరాలను చాలా తేలికగా చేస్తున్నాడు’. అనే డైలాగ్ ఆసక్తిగా ఉంది. ఇందులో చియాన్ విభిన్న పాత్రల్లో కనిపించి, మరోసారి ఫ్యాన్స్ ను ఫిదా చేయబోతున్నాడు. ఇక ఇందులో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ పలు కీలక సన్నివేశాల్లో కనిపించాడు.

ఇక టీజర్ చూస్తుంటే లెక్కల మాస్టర్ గా కోబ్రా అన్యాయాన్ని ఎలా ఎదుర్కొన్నాడనేదే ఈ కథ అని అర్థమవుతోంది. 7 స్క్రీన్ స్టూడియో సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మృణాళిని, రవి, కె.ఎస్ రవికుమార్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ముఖ్యపాత్రలో సందడి చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news