మన చెవులలోకి ఏదైనా చిన్న పురుగు వెళ్తేనే ఎంత ఇబ్బందిగా ఉంటుందో అందరికీ తెలిసిందే. దాన్ని బయటకు తీసేందుకు మనం నానా అవస్థలు పడతాం. మనకు చేతకాకపోతే డాక్టర్ వద్దకు వెళ్తాం. అయితే ఆ వ్యక్తి చెవిలో ఏకంగా బొద్దింకలే కాపురం పెట్టేశాయి.
మన చెవులలోకి ఏదైనా చిన్న పురుగు వెళ్తేనే ఎంత ఇబ్బందిగా ఉంటుందో అందరికీ తెలిసిందే. దాన్ని బయటకు తీసేందుకు మనం నానా అవస్థలు పడతాం. మనకు చేతకాకపోతే డాక్టర్ వద్దకు వెళ్తాం. అయితే ఆ వ్యక్తి చెవిలో ఏకంగా బొద్దింకలే కాపురం పెట్టేశాయి. అవును, షాకింగ్‌గా ఉన్నా ఇది నిజమే. చెవిలో బాగా నొప్పి వస్తుందని డాక్టర్ వద్దకు వెళితే ఆ వ్యక్తి చెవిలో ఉన్న బొద్దింకలను చూసి అవాక్కవడం డాక్టర్ల వంతైంది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…
చైనాలోని గువాంగ్‌డాంగ్ ప్రావిన్స్ హుయాంగ్ జిల్లాలో నివాసం ఉండే ఎల్‌వీ (24) అనే ఓవ్యక్తికి ఇటీవలే ఉన్నట్టుండి సడెన్‌గా చెవుల్లో తీవ్రమైన నొప్పి మొదలైంది. అది బాగా ఎక్కువవడంతో అతను తనకు దగ్గర్లో ఉన్న సన్హె అనే హాస్పిటల్‌కు వెళ్లాడు. అక్కడ ఈఎన్‌టీ స్పెషలిస్టులు ఎల్‌వీకి టెస్టులు చేసి ఖంగు తిన్నారు. ఎందుకంటే.. ఎల్‌వీ కుడి చెవిలో ఏకంగా కొన్ని బొద్దింకలు కాపురం పెట్టేశాయి. దీంతో డాక్టర్లు కష్టపడి పలు పరికరాల సహాయంతో అతని చెవిలో ఉన్న తల్లి బొద్దింక, పిల్ల బొద్దింకలను ఒక్కొక్కటిగా తొలగించారు. కాగా ఎల్‌వీ ఇంట్లో తన బెడ్ దగ్గర ఫుడ్ ప్యాకెట్లను తిని అలాగే పడేయడంతో వాటి వద్దకు వచ్చే బొద్దింకలే అతని చెవిలోకి వెళ్లాయని తరువాత గుర్తించారు. ఏది ఏమైనా.. ఇలాంటి కష్టం ఎవరికీ రాకూడదు.. ముఖ్యంగా బొద్దింకలంటే భయపడేవారికి..!