కాఫీతో లివర్‌, జీర్ణ సమస్యలు దూరం.. సైంటిస్టుల పరిశోధనలో వెల్లడి..

కాఫీ తాగే వారికి గుడ్‌ న్యూస్‌. నిత్యం కాఫీ తాగడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని.. అలాగే ఇప్పటికే జీర్ణ సమస్యలు ఉన్నవారు నిత్యం కాఫీ తాగడం వల్ల ఆ సమస్యల నుంచి బయట పడే అవకాశం ఉంటుందని.. సైంటిస్టులు చేపట్టిన తాజా పరిశోధనల్లో వెల్లడైంది. ఈ మేరకు ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ సైంటిఫిక్‌ ఇన్ఫర్మేషన్‌ ఆన్ కాఫీ (ఐఎస్‌ఐసీ)కి చెందిన పరిశోధకులు కాఫీ అండ్‌ ఇట్స్‌ ఎఫెక్ట్‌ ఆన్‌ డైజెషన్‌ అనే నివేదికను తాజాగా విడుదల చేశారు.

coffee is good for liver and digestive problems

సైంటిస్టులు చెబుతున్న ప్రకారం.. కాఫీని నిత్యం తాగడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయని అంటున్నారు. ముఖ్యంగా గాల్‌ స్టోన్స్‌ రావని, పాంక్రియాటైటిస్‌ సమస్య తగ్గుతుందని, లివర్‌ వ్యాధులు రాకుండా ఉంటాయని, మలబద్దకం, అజీర్ణం రావని అంటున్నారు. కాఫీ తాగడం వల్ల జీర్ణాశయంలో యాసిడ్లు ఎక్కువగా ఉత్పత్తి అయి తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుందని అంటున్నారు.

అయితే గ్యాస్‌ ట్రబుల్‌ ఉన్న వారు కాఫీ తాగకపోవడమే మంచిదని, లేదంటే ఆ సమస్య మరింత ఎక్కువవుతుందని, ఇక ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు కాఫీ తాగితే.. పైన తెలిపిన అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని.. సైంటిస్టులు వెల్లడించారు.