కోయంబత్తూరు: కారులో గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో ఉగ్రవాదులకు లింక్స్..?

-

తమిళనాడు లోని కోయంబత్తూర్ లో కారులో గ్యాస్ సిలెండర్ పేలుడులో ఘటనలో ఉగ్రవాదులకు లింక్స్ ఉన్నాయని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పేలుడుకి ముందు కారులో గ్యాస్ సిలెండర్ పెట్టడానికి ముబిన్ ఇంటి నుండి సిలెండర్ తీసుకువచ్చారు నలుగురు యువకులు. ఈ దృశ్యాలు సిసి టీవీలొ రికార్డు అయ్యాయి. పేలుడుకు పలు రసాయనాలు వాడినట్లు గుర్తించారు పోలీసులు.

నిన్న ఉదయం కోయంబత్తూర్‌లోని ఉక్కడంలోని దేవాలయం సమీపంలో కారులో ఎల్‌పిజి సిలిండర్లు పేలి ఒకరు మృతి చెందారు. మృతి చెందిన యువకుడు 25 ఏళ్ల జమేషా ముబిన్‌గా గుర్తించారు. 2019లో ముబిన్ ని విచారించింది NIA. ముబిన్ ఇంటిలో పొటాషియం నైట్రేట్, అల్యూమినియం పౌడర్, బొగ్గు మరియు సల్ఫర్ -నాటు బాంబుల తయారీకి ఉపయోగించే పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. కారు ఇప్పటి వరకు తొమ్మిది మంది పేర్లు మారిందని గుర్తించారు. భవిష్యత్తులో ఏదో భారి ప్లాన్ చేస్తున్నట్టు భావుస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news