పవన్‌పై ‘ఫ్యాన్స్’ ఫైర్..రిస్క్ ఉన్నవారే..!

-

ఎప్పుడైతే పవన్..వైసీపీ టార్గెట్‌గా పరుషపదజాలంతో విరుచుకుపడ్డారో..అప్పటినుంచి పవన్‌పై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల మాటల దారి తీవ్రమైంది. మామూలుగానే వైసీపీ నేతలు మాటలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. వ్యక్తిగతంగా దారుణమైన మాటలతో ప్రత్యర్ధులకు చుక్కలు చూపిస్తారు. చంద్రబాబు, పవన్‌లపై అదేవిధంగా మాటల దాడి చేస్తారు.

ఆ దాడి భరించలేక..ఇటీవల పవన్ రివర్స్ అయి..తాను కూడా మాటల దాడి మొదలుపెట్టారు. ఇక పవన్ కూడా తిడితే వైసీపీ నుంచి రియాక్షన్స్ ఎలా ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. ఓ రేంజ్‌లో పవన్‌పై విరుచుకుపడుతున్నారు. కానీ ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే..ఎవరికైతే పవన్..టీడీపీతో కలిస్తే రిస్క్ ఉంటుందో..ఆ వైసీపీ నేతలే పవన్‌ని గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. ప్యాకేజ్ స్టార్ అని, చంద్రబాబు దత్తపుత్రుడు అని, మూడు పెళ్లిళ్లు అని చెప్పి వ్యక్తిగతమైన మాటల దాడి చేస్తున్నారు.

పేర్ని నాని, అంబటి రాంబాబు, కొట్టు సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, కన్నబాబు, అవంతి శ్రీనివాస్, సీదిరి అప్పలరాజు, జోగి రమేశ్, రోజా, భూమన కరుణాకర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, కారుమూరి నాగేశ్వరరావు, ధర్మాన ప్రసాదరావు..ఇలా వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు పవన్‌ని గట్టిగా  టార్గెట్ చేస్తున్నారు. అయితే పవన్-టీడీపీతో కలిస్తే వీరందరికి గెలుపు చాలా కష్టమవుతుంది. అందుకే అనుకుంటా పదే పదే వీరే పవన్‌పై విరుచుకుపడుతున్నారు.

 ఎందుకంటే వీరికి పవన్ ..టీడీపీతో కలవకుండా చేయడమే టార్గెట్..గత ఎన్నికల్లో పవన్ విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి..వీరంతా వైసీపీ నుంచి ఈజీగా గెలిచేశారు. ఉదాహరణకు పేర్ని నాని ఉన్నారు..మచిలీపట్నం నుంచి దాదాపు 5 వేల ఓట్ల మెజారిటీతో టీడీపీపై గెలిచారు. కానీ అక్కడ జనసేనకు పడిన ఓట్లు 20 వేలు పైనే. అదే టీడీపీ-జనసేన కలిసి ఉంటే పేర్ని పరిస్తితి ఏమయ్యేదో ఊహించుకోవచ్చు. అందుకే టీడీపీ-జనసేన పొత్తు ఉండకుండా చేయడమే లక్ష్యంగా వైసీపీ నేతల మాటల దాడి కొనసాగుతుంది. కానీ పవన్ మాత్రం చంద్రబాబుతో కలిసే ముందుకెళ్లెలా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news