తెలంగాణలో వీస్తున్న చలిగాలులు.. బీఅలర్ట్!

-

తెలంగాణ రాష్ట్రాన్ని ముసురు కమ్మేసింది. భానుడు కిరణాల ప్రకాశం అస్సలే కనిపించడం లేదు. ఎటూచూసిన దట్టమైన మేఘాలు కమ్ముకున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి.దీంతో ఉదయం, మధ్యాహ్నం అనే తేడాలు లేకుండా మొత్తం చీకటి అలుముకుంది. ముసురు ధాటికి ఇంట్లో నుంచి బయటకు వెళ్లేందుకు జనాలు జంకుతున్నారు. దీనికి తోడు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక చలిగాలుల తీవ్రత సైతం పెరగడంతో ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రావడం లేదు.

ఓవైపు ముసురు, మరోవైపు వర్షం, చలిగాలుల ధాటికి ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో విషజ్వరాలు స్వైర విహారం చేస్తున్నాయి. దీనికి తోడు ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో వైరల్ ఫీవర్స్ విజృంభించే అవకాశం మరింత ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.చలిగాలుల తీవ్రతకు జ్వరాల తీవ్రత పెరుగుతుందని అందుకే తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. నేడు ఆదివారం కావడంతో ఆఫీసులు, స్కూళ్లకు సెలవు కారణంగా రోడ్లపై పెద్దగా ట్రాఫిక్ కనిపించడం లేదు. ఇక సోమవారం కూడా విద్యార్థులకు సెలవు ప్రకటించినట్లు సమాచారం.

 

 

Read more RELATED
Recommended to you

Latest news