మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ తరుణంలోనే.. భారీ వర్షానికి ఇళ్లు నీట మునిగిపోయాయి. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని బొడ్డి తండాలో భారీ వర్షానికి ఇళ్లు మొత్తం మునిగిపోయాయని సమాచారం అందుతోంది.
ఇండ్లలోకి మొత్తం నీరు చేరడంతో, ఇండ్ల మిద్దెల మీదకు ఎక్కి తండా వాసులు తలదాచుకున్నట్లు వీడియోలు కూడా వైరల్ గా మారాయి. తమను తెలంగాణ ప్రభుత్వం రక్షించాలంటూ కోరుతున్నారు నర్సింహులపేట మండలంలోని బొడ్డి తండా వాసులు.
ఇక మహబూబాబాద్ జిల్లాలో రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. కేసముద్రం-ఇంటికన్నె మార్గంలో ట్రాక్‌ను ఆనుకుని వరద నీరు ప్రవహిస్తుండటంతో ట్రాక్ కింద ఉండే రాళ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. విద్యుత్ స్థంభాలు సైతం పక్కకు ఒరిగాయి. దీంతో ఈ మార్గంలో రైళ్లు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.