రాష్ట్రంలో ఉద్యోగులు ఘర్షణ వాతావరణం తీసుకురావద్దని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి బొత్స సత్య నారాయణ అన్నారు. చర్చలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయనే విషయాన్ని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని ఆయన అన్నారు. ఉద్యోగ సంఘాలు పట్టుదలకు వెళ్తే లాభం ఉండదని అన్నారు. చర్చలకు వచ్చి.. సమస్యలు పరిష్కారించుకోవాలని సూచించారు. కాగ ఈ రోజు కూడా కొన్ని ఉద్యోగ సంఘాలు చర్చకు వచ్చాయని అన్నారు.
కానీ కొంత మంది కారణంగా ఉద్యోగులు నష్టపోతున్నారని అన్నారు. కాగ గతంలో కంటే.. ఇప్పుడు మెరుగైన పీఆర్సీ ఇచ్చామని అన్నారు. అలాగే ఈ నెల కొత్త పీఆర్సీ ప్రకారమే.. జీతాలు చెల్లిస్తామని స్పష్టం చేశారు. అయితే గతంలో కంటే.. ఇప్పుడు జీతం పెరిగిందా.. లేదా తగ్గిందా.. అని ఉద్యోగులే తమ పే స్లిప్ ల ఆధారంగా తెలుసుకోవాలని అన్నారు. ఉద్యోగుల జీతంలో ఒక్క రూపాయి కూడా తగ్గదని తెల్చి చెప్పారు. ఒక్క ఉద్యోగి ముందుకు వచ్చినా.. పీఆర్సీపై చర్చించేందుకు సిద్దమని ప్రకటించారు.