కమెడియన్ పృథ్వి కి అనారోగ్యం..!

-

ఇటీవల టాలీవుడ్ కమెడియన్ పృథ్వి అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన అభిమానులు అందరూ ఆందోళన చెందుతున్నారు, గత పది రోజుల నుంచి తీవ్ర జ్వరం జలుబు లక్షణాలతో బాధపడుతున్న కమెడియన్ పృథ్వి… సోమవారం రాత్రి హాస్పిటల్ లో చికిత్స నిమిత్తం చేరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తమ అభిమాన కమిడియన్ కి ఏమై ఉంటుంది అని అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా కమెడియన్ పృథ్వి తన ఆరోగ్య పరిస్తితి గురించి వివరిస్తూ ఈ వీడియోని సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. తాను గత కొన్ని రోజులుగా తీవ్రమైన జ్వరం బాధపడుతున్నానని… రెండుసార్లు కరోనా పరీక్షలు చేయించుకున్నప్పటికీ నెగిటివ్ అని వచ్చింది అంటూ కమెడియన్ పృథ్వి తెలిపాడు, అయితే కొంతమందికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నప్పటికీ నెగిటివ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ వైద్యులు తెలిపారు అంటూ చెప్పుకొచ్చాడు. వైద్యుల సూచన మేరకు క్వారంటైన్ లో చేరానని తెలిపిన కమెడియన్ పృథ్వి.. తన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version