ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ని ఈడీ అధికారులు ఈ రోజు రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరు పరిచారు. ఆయన కోర్టు కి తీసుకు వెళ్తుండగా ఏదైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారని అక్కడ ఉన్న మీడియా ప్రతినిధి అడగగా అందుకు కేజ్రీవాల్ రియాక్ట్ అయ్యారు. నా జీవితం దేశానికి సమర్పితం.
నేను లోపల వున్నా బయట వున్నా దేశం కోసం పని చేస్తానని చెప్పారు. ఆ తర్వాత కోర్టు లోపలికి వెళ్లిపోయారు. రౌస్ అవెన్యూ కోర్టు లో కేజ్రీవాల్ ని ప్రవేశపెట్టిన ఈడీ లిక్కర్ కుంభకోణం కేసు లో కీలక సూత్రధారి కేజ్రీవాల్ అని ఆరోపించింది ఈ కేసులో మరింత విచారించడానికి ఆయనని పది రోజులు పాటు రిమాండ్ కి ఇవ్వాలని కోరింది. ఇంకోవైపు కేజ్రీవాల్ అరెస్టు మీద ఆప్ నేతలు మండిపడుతున్నారు. అయన అంటే ఒక వ్యక్తి కాదని ఒక సిద్ధాంతం అని పంజాబ్ సీఎం అన్నారు. అలానే ఆప్ నేతలు ఆయన వెంట ఉన్నారని అన్నారు