గుడ్ న్యూస్: రూ. 91.50 తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర.. కానీ ?

-

ఎంతో కాలంగా మధ్య తరగతి ప్రజలను పట్టి పీడిస్తున్న అతి పెద్ద సమస్య నిత్యవసర వస్తువుల ధరలు భారీగా పెరిగిపోవడం.. అందులో గ్యాస్ సిలిండర్ ఎంత ముఖ్యమో తెలిసిందే.. ఒకప్పుడు 600 ఉన్న సిలిండర్ ధర ఇప్పుడు 1300 వరకు ఉంది..ఇంకా బ్లాక్ లో అయితే 1500 పెట్టే పరిస్థితి. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం లో అసాధారణంగా సిలిండర్ ధరలు పెరిగిపోయాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతునప్పటికీ ఇండియాలో మాత్రం పెట్రోల్, డీజిల్ మరియు గ్యాస్ సిలిండర్ ధరలు మాత్రం తగ్గని సంఘటనలు చూస్తున్నాము. అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయట.

మన దేశంలో ఉన్న ఆయిల్ కంపెనీలు ఈ గ్యాస్ సిలిండర్ ధరలలో కొన్ని స్వల్ప మార్పులు చేశారు. 19 కేజీల గ్యాస్ సిలిండర్ పై రూ. 91.50 ను తగ్గించింది… తగ్గించిన ధరతో ప్రస్తుతం కమర్సియల్ గ్యాస్ ధర రూ. 2233 కు చేరుకుంది. కానీ బ్యాడ్ న్యూస్ ఏమిటంటే గృహ అవసరాలకు వాడే గ్యాస్ లో ఎటువంటి తగ్గింపు జరగలేదని తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన మధ్యతరగతి ప్రజలు తమ అసంతృప్తిని ఆయిల్ కంపెనీలు మరియు ప్రభుత్వంపై చూపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version