కమ్యూనిస్టు పార్టీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ రాజ్యసభ సభ్యులు సీతారాం ఏచూరి కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రి చేరి చికిత్స పొందారు. గురువారం ఆయన పరిస్థితి విషమించి తిరిగి రాని లోకాలకు వెళ్లారు. ఆయర మరణంతో కేవలం కమ్యూనిస్టు పార్టీలోనే కాకుండా దేశ రాజకీయాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
1952లో ఆయన చెన్నైలో జన్మించి సీతారాం ఏచూరిగా నామకరణం పొందారు. 1975లో కమ్యూనిస్టు పార్టీలో సభ్యత్వం తీసుకున్నారు. ఆయన స్వస్థలం ఏపీలోని కాకినాడ. పూర్తి పేరు సీతారామారావు ఏచూరి. 10వ తరగతి వరకు హైదరాబాద్ లో చదువుకున్నారు. ఢిల్లీ స్టీఫెన్స్ కళాశాలలో బీఏ ఆనర్స్ పూర్తి చేశారు. మూడు సార్లు జేఎన్ యూ విద్యార్థి నాయకుడిగా ఎన్నికయ్యారు. 1985లొో కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1999లో పొలిట్ బ్యూరో గా చోటు దక్కించుకున్నారు. 2005లో తొలిసారి బెంగాల్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2015, 2018, 2022 వరుసగా మూడుసార్లు సీపీఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఊపిరితిత్తుల సమస్యతో ఆగస్టు 17న ఎయిమ్స్ లో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి ఇవాళ కన్ను మూశారు. పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.