పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కాశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారం రేపాయి. ప్రధానంగా తెలంగాణ శాసనసభలో పీఏసీ చైర్మన్ గా ఎన్నికైన అరికపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్ల చోటు చేసుకుంటున్నాయి. ఈ తరుణంలోనే గురువారం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి పై అరికెపూడి గాంధీ తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు దాడి చేశారు.
ఈ ఘటనపై స్పందించిన మాజీ మంత్రి హరీశ్ రావు.. పిర్యాదు చేయడానికి సైబరాబాద్ సీపీ కార్యాలయానికి వెళ్లారు. అయితే పోలీసులు మాత్రం కేవలం ముగ్గురు ఎమ్మెల్యేకు మాత్రమే సీపీ ఆఫీసులోకి అనుమతిస్తామని.. గేటు వద్దనే నిలిపివేశారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కాసేపు పోలీసులు, బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం ఎమ్మెల్యేలందరినీ సీపీ కార్యాలయంలోనికి అనుమతించాలంటూ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. సీపీ ఆఫీస్ మెట్లపై బైఠాయించారు. అనంతరం లోపలికీ నడుచుకుంటూ వెళ్లిన హరీశ్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు సీపీ లేకపోవడంతో జాయింట్ సీపీకి ఫిర్యాదు చేశారు.