అసదుద్దీన్ ఓవైసీపై ఈసీకి ఫిర్యాదు బీజేపి అభ్యర్థి

-

ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై హైదరాబాద్ లోక్ సభ బీజేపీ అభ్యర్థిని మాధవీలత ఈసీ కి కంప్లైంట్ చేశారు.ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీపై ఓవైసీ తప్పుడు ప్రచారం చేస్తు్న్నారని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఓవైసీపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. అలాగే ఎలక్షన్ కమిషన్‌కు తప్పుడు అఫిడవిట్ ఇచ్చారని హైదరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్‌పైన ఫిర్యాదు చేశారు. శ్రీనివాస్ సమర్పించిన అఫిడవిట్‌ను మరోసారి పరిశీలించి ఆయనపై యాక్షన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇక, తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాల్లో హైదరాబాద్ పోరు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గత 40 సంవత్సరాల నుండి ఏకధాటిగా హైదరాబాద్‌ను పాలిస్తున్న ఎంఐఎంను గద్దె దించడమే లక్ష్యంగా కనీసం పార్టీలో సభ్యత్వం కూడా లేని మాధవీలతకు అనే మహిళలకు ఎంపీ టికెట్ ఇచ్చింది.బీజేపీ అంచనాలకు తగ్గట్లే మాధవీలత సైతం ఓవైసీతో హోరాహోరీగా తలపడుతోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news