మల్లారెడ్డి సర్వే షాకింగ్ రిపోర్టు.. మూడో స్థానంలో ఏ పార్టీ అంటే..?

-

తెలంగాణలో రాజకీయాలు చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు, కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక మే 13న జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు సర్వేలు చేస్తూ.. ఈ పార్టీ అధికారంలోకి వస్తుందని చెబుతున్నారు. తాజాగా మల్లారెడ్డి సర్వే నిర్వహించారు. ఆ సర్వే ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

వేదిక ఏదైనా తన మార్క్ పంచ్ డైలాగ్ తో మల్లారెడ్డి నవ్వులు పూయస్తారు. ఇక, డీజే టిల్లు పాట పెడితే చిన్న పిల్లాడిలా అదిరిపోయే స్టెప్పులు వేసి ఆకట్టుకుంటారు. అయితే పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రముఖ సంస్థలు తమ సర్వే రిపోర్టులను వెల్లడిస్తున్న సమయంలో మల్లారెడ్డి తన షాకింగ్ ప్రిడిక్షన్ ను బయటపెట్టారు. రోజురోజుకి బీఆర్ఎస్ గ్రాఫ్ పెరుగుతుందన్నారు. లేటెస్ట్ సర్వే రిపోర్టు ప్రకారం.. బీఆర్ఎస్ పార్టీకి మల్కాజ్ గిరి పార్లమెంట్ 38 శాతం, కంటోన్మెంట్లో 42 శాతం ఓటు షేర్ వస్తుందన్నారు. ఇదే సమయంలో బీజేపీకి 28 శాతం, కాంగ్రెస్ పార్టీ 27 శాతమే ఓటు షేర్ వస్తుందని జోస్యం చెప్పారు. ఇక, కాంగ్రెస్ థర్డ్ ప్లేసే అని మల్లారెడ్డి నవ్వుతూ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news