అటవీ శాఖకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. అడవుల రక్షణకు అటవీ అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని చెప్పారు. తాజాగా గుంటూరులో నిర్వహించిన అటవీశాఖ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పవన్ పాల్గొని మాట్లాడారు. అటవీశాఖ అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరిచిపోకూడదన్నారు. వివిద వర్గాల నుంచి అటవీశాఖకు రూ.5కోట్ల విరాళం సేకరించి ఇస్తానని తెలిపారు. భవిష్యత్ లో అటవీ అమరులకు స్థూపాలు నిర్మించి నివాళులర్పిద్దాం. స్మగ్లర్ల నుంచి అడవుల రక్షణకు ఎలాంటి సహాయమైన అందిస్తామని తెలిపారు. అటవీశాఖలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. విధులు నిర్వహిస్తూ 23 మంది ప్రాణాలు కోల్పోయారని.. అమరుల స్మరణకు ఫారెస్ట్ ఆఫీస్ బ్లాక్ లకు వారి పేర్లు పెట్టాలని పేర్కొన్నారు.
వైసీపీ అధ్యక్షుడు జగన్ పై, ఆ పార్టీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరవై ఏళ్లు అధికారంలో ఉంటామంటూ అధికారులను ఇష్టమొచ్చినట్టు ఉపయోగించుకున్నారని వైసీపీ నేతలను ఉద్దేశించి పవన్ పేర్కొన్నారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అడిగితే భద్రత కల్పిస్తామని చెప్పారు. మహిళా భద్రత విషయంలో సమాజంలో ప్రతీ ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.