మంత్రి మేకపాటి మృతికి ఏపీ, తెలంగాణ నేతల సంతాపం

-

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి.. కాసేపటి క్రితమే మృతి చెందిన సంగతి తెలిసిందే. గుండె పోటు రావడంతో.. మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి.. మరణించారు. దీంతో వైసీపీ పార్టీ లో విషాదం చోటు చేసుకుంది. అయితే.. ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి పట్ల తెలంగాన, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయ నేతలకు ఆయన మరణం పట్ల సంతాపం తెలుపుతున్నారు.

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి మృతి పట్ల బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే గౌతమ్ రెడ్డి మరణం అత్యంత బాధాకరమని… గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటున్నాని తెలిపారు బండి సంజయ్.

ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతి పట్ల తీవ్ర సంతాపం తెలిపారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, సీపీఐ నేత నారాయణ. అటు ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం పట్ల తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు గవర్నర్. అటు కాసేపట్లో హైదరాబాద్ రానున్నారు ఏపీ సీఎం జగన్. మేకపాటి గౌతమ్‌రెడ్డికి నివాళులర్పించనున్నారు జగన్. ఇక ఇప్పటికే అపోలో ఆస్పత్రికి చేరుకున్న వైఎస్ విజయమ్మ, షర్మిల.. సంతాపం తెలిపారు. అటు చంద్రబాబు కూడా అపోలో ఆస్పత్రి రానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news