నేషనల్ హైవేపై కుప్పలుతెప్పలుగా కండోమ్స్..!

కర్ణాటక రాష్ట్రంలోని తుముకూరు జాతీయ రహదారిపై ఓ వింత ఘటన చోటుచేసుకుంది. జాతీయ రహదారి 48 ఐదు వందల సంఖ్యలో… ఒక్కసారిగా కాండోములు దర్శనమిచ్చాయి. ఇది చూసి అడ్డుగా వెళ్లే వాహనదారులు ఆశ్చర్యానికి గురయ్యారు. శ్రీ రాజు థియేటర్ కు ఎదురుగా ఉన్న ఓ ఫ్లైఓవర్ పై కండోమ్ లు కుప్పలు కుప్పలు గా కనిపించాయి.

అయితే ఇవి ఎవరైనా పారేశారు లేదా ఏదైనా వాహనంలో తరలిస్తున్నప్పుడు… పడిపోయా యో తెలియదు. అయితే ఇందులో కొన్ని వినియోగించిన కాండోమ్ లు ఉండగా… మరి కొన్ని ప్యాకెట్లలో ఉన్నాయి. అయితే ప్రస్తుతం వీటికి సంబంధించిన ఓ వీడియో మరియు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయంపై అధికారులు ఇప్పటి వరకు స్పందించలేదు. నిత్యం రద్దీగా తిరిగే ప్రదేశాల్లోనే ఇలా ఉంటే… ఎవరూ లేని ప్రాంతాల్లో పరిస్థితి ఏంటని స్థానికులు మండిపడుతున్నారు. నడి రోడ్డు పై ఇలాంటి పరిస్థితులు ఉండటం మరీ దారుణం అంటున్నారు.