కాంగ్రెస్ బస్సు యాత్ర వాయిదా

-

కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గణనీయంగా పుంజుకుంది. ఇప్పుడు బీఆర్ఎస్‌తో బలంగా ఢీకొట్టే పార్టీ కాంగ్రెస్‌గానే ఎదిగింది. అసంతృప్తులను బుజ్జగిస్తూ కొత్త నేతలను చేర్చుకుంటూ వ్యూహ, ప్రతివ్యూహాలకు పదునుపెడుతూ ప్రచారంలోనూ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతున్నది. తెలంగాణలో కాంగ్రెస్‌కు మెరుగైన పరిస్థితులు కనిపించడంతో అధిష్టానం పూర్తి ఫోకస్ తెలంగాణ పై పెట్టింది.

నేటి నుంచి ఆరు రోజుల పాటు కాంగ్రెస్ విజయభేరి రెండో విడత బస్సుయాత్ర - Mana  Telangana

కాంగ్రెస్ బస్సు యాత్ర తాత్కాలికంగా వాయిదా పడింది. అనివార్య కారణాల వల్ల యాత్రను వాయిదా వేస్తున్నట్లు పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తామన్నారు. తాజా నిర్ణయంతో రేపు జనగామ, ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో నిర్వహించాల్సిన యాత్ర వాయిదా పడింది.

అయితే, అనివార్యకారణాల వల్లనే యాత్ర వాయిదా వేసినట్లు చెబుతున్నప్పటికీ.. టికెట్ రాని నాయకులు తీవ్రంగా స్పందిస్తుండడం, కొందరు పార్టీని వీడడం, రాజీనామాలు చేస్తుండడంతో ముందు వాటిని నిలువరించేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. అంతేకాకుండా సోమవారం యాత్రలో పాల్గొనాల్సిన ముఖ్యఅతిథి రాష్ట్ర పర్యటన షెడ్యూల్ ఖరారు కాకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news