రేపు జిల్లా బంద్‌కు కాంగ్రెస్‌ పిలుపు..ప్రభుత్వం తప్పిదాల వల్లే మునిగిన కేఎల్​ఐ

-

కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్‌పై కాంగ్రెస్‌ పోరు బాట పట్టింది..భారీ వర్షాలకు లిఫ్ట్ కూలిపోవడంపై గత రెండు, మూడు రోజులుగా కాంగ్రెస్‌ ఆందోళన చేస్తుంది..పంపు హౌజ్ నీట మునిగిన నేపథ్యంలో పరిశీలించేందు ప్రతి పక్షాలుకు, మీడియాను లోపలికి అనుమతించలేదు..ప్రభుత్వం తీరుకు నిరసనగా రేపు ఉమ్మడి మహబూబ్ నగర్‌ జిల్లా బంద్‌కు కాంగ్రెస్ పిలుపునిచ్చింది..కల్వకుర్తి లిఫ్ట్ పై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపణలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ..
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం లిఫ్ట్ లో నీట మునిగిన ఎల్లూరు పంపు హౌజ్​ను సందర్శించేందుకు శనివారం కాంగ్రెస్ పార్టీల నేతలు చేసిన ప్రయత్నాలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు..రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, మాజీ ఎంపీ మల్లు రవి సహా ఇతర నేతలు పోలీసులు తెలకపల్లి వద్ద అడ్డుకున్నారు..కేఎల్​ఐ (కల్వకుర్తి లిఫ్ట్​ ఇరిగేషన్​)కి పక్కనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సొరంగ మార్గం నిర్మాణ పనులు చేపట్టవద్దని నిపుణుల కమిటీ సూచించినా..కమిషన్లకు కక్కుర్తి పడి డిజైన్ మార్పు చేశారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు.ఎత్తిపోతల పథకం అప్రోచ్‌ కెనాల్‌కు 250 మీటర్ల దూరంలో బ్లాస్టింగ్‌ నిర్వహిస్తే ఎత్తిపోతలకు ప్రమాదం జరగదా అని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్‌ నేతలు..పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును కల్వకుర్తి లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు దగ్గరగా కట్టడం వల్లే పంపుసెట్లు ముగినిగాయని కాంగ్రెస్‌ విమర్శిస్తుంది..విపక్ష నేతలు సహా ఎవరినీ లోనికి అనుమతించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news