క్రెడిట్ కార్డుతో షాపింగ్ చేస్తే అదిరిపోయే బెనిఫిట్స్.. అవి ఏంటంటే?

-

పండుగ సీజన్ హడావిడి మొదలయింది. ఇప్పటికే పండుగ సీజన్ షాపింగ్ షురూ చేసేశారు. ఈ-కామర్స్ కంపెనీలు అయిన అమెజాన్ ,ఫ్లిప్‌కార్ట్ వంటి మాధ్యమాలలో నచ్చిన ప్రొడక్టులను కొనుగోలుచేసుకుంటున్నారు. కొంత మంది కొత్త వాహనాన్ని ఇంటికి తీసుకెళ్తున్నారు. మరికొందరు అయితే టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ వంటి వాటిని కొనుగోలు చేస్తున్నారు.

షాపింగ్ చేయాలని మీరు ప్లాన్ చేస్తున్నారా? మీరు కొత్తగా ఏదైనా ప్రొడక్ట్ కొనుగోలు చేయాలని భావిస్తే, క్రెడిట్ కార్డు ద్వారా షాపింగ్ చేస్తే అదిరిపోయే బెనిఫిట్స్ పొందొచ్చు. షాపింగ్ చేసే వారు అనేక రకాల ప్రొడక్టులు కొనుగోలు చేస్తుంటారు. కొందరు నేరుగా అకౌంట్‌లోని డబ్బులతో నచ్చిన ప్రొడక్స్ ను కొనుగోలు చేస్తారు. ఇంకొందరు క్రెడిట్ కార్డు ద్వారా నచ్చిన ప్రొడక్ట్ ‌ను సొంతం చేసుకుంటారు. మరికొందరు పర్సనల్ లోన్ తీసుకొని మరి షాపింగ్ చేస్తుంటారు. అయితే వీటిల్లో క్రెడిట్ కార్డు ద్వారా షాపింగ్ చేయడం ఉత్తమం అని అంటున్నారు.క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే నెల చివరిలో డ్యూ డేట్ ‌లోగా డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. కుదరకపోతే ఈఎంఐ ఆప్షన్ కూడా పెట్టుకొని ప్రతి నెల కొంత మొత్తం చెల్లించవచ్చు. సక్రమంగా ప్రతి నెలా డబ్బులు చెల్లిస్తే క్రెడిట్ స్కోర్ కూడా మెరుగుపడుతుంది. దీంతో భవిష్యత్ ‌లో బ్యాంకుల నుంచి రుణం కూడా సులభంగా పొందవచ్చు.

క్రెడిట్ కార్డులపై నో కాస్ట్ ఈఎంఐ అనే ఆప్షన్ కూడా ఉపయోగించుకోవచ్చు. దీంతో అదనంగా వడ్డీ లాంటి డబ్బులు కట్టనవసరం లేదు. క్రెడిట్ కార్డులపై క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్, రివార్డ్స్ వంటి అనేక బెనిఫిట్స్ కూడా పొందొచ్చు. క్రెడిట్ కార్డుపై ఎటువంటి ఆఫర్లు లేకపోయినా కార్డు ద్వారా కొనుగోళ్లు జరిపితే చాలు రివార్డు పాయింట్లు వస్తాయి. ఇదే కాకుండా క్రెడిట్ కార్డుపై ప్రి అప్రూవ్డ్ లోన్ ఫెసిలిటీ కూడా పొందవచ్చును. ఇది మీరు మీ క్రెడిట్ కార్డును ఉపయోగించే విధానంపై పూర్తిగా ఆధారపడి ఉంటుంది. మీరు సక్రమంగా క్రెడిట్ కార్డు ఉపయోగిస్తూ, టైంకి కార్డు బిల్లు చెల్లిస్తూ వస్తే చాలు మీకు మీ బ్యాంక్ నుండి క్రెడిట్ కార్డుపై ప్రిఅప్రూవ్డ్ లోన్ ఫెసిలిటీని కూడా అందిస్తుంది. ఈ బెనిఫిట్ ద్వారా వెంటనే డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్‌కు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news