కాంగ్రెస్‌కు దేశం పట్ల పట్టింపు లేదు : ప్రధాని మోడీ

-

ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్ష ఇండియా కూటమిపైతీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈసారి లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరంపైకి కాంగ్రెస్ బుల్డోజర్‌ను పంపిస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. శుకవారం యూపీలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన మోడీ.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రామాలయంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేయాలని చూస్తుందని, ఆ తర్వాత ఆలయాన్ని కూల్చివేస్తుంవిమర్శించారు. సమాజ్‌వాదీ పార్టీ-కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రామ్‌లల్లాను బలహీనపరుస్తాయని అన్నారు.

దేశ విభజనకు కాంగ్రెస్‌దే బాధ్యతని, దేశం విడిపోతుందనే అంశం అసాధ్యం అనుకున్న దాన్ని ఆ పార్టీ వల్లనే జరిగింది అని మండిపడ్డారు.స్వాతంత్ర్య పోరాటం జరుగుతున్న సమయంలో దేశాన్ని విభజించాలనే చర్చ వచ్చినప్పుడు, దేశాన్ని విభజించవచ్చా? జరుగుతుందా అనుకున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ దేశాన్ని విభజించినది అని,వారి ట్రాక్ రికార్డు అలాంటిదని మోడీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్‌కు దేశం పట్ల పట్టింపు లేదు. వాళ్లకు కుటుంబం, అధికారం కోసమే పనిచేస్తుంటారన్నారు ప్రధాని మోడీ.

Read more RELATED
Recommended to you

Latest news