కామారెడ్డి డిక్లరేషన్ కు కాంగ్రెస్ కట్టుబడి ఉంది : వీహెచ్

-

బలహీన వర్గాల సంక్షేమానికి.. అభివృద్ధికి పని చేసే చిత్తశుద్ది కాంగ్రెస్ ప్రభుత్వానికే ఉందని.. కామారెడ్డి డిక్లరేషన్ కు కాంగ్రెస్ కట్టుబడి ఉందని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ వీ.హనుమంతరావు పేర్కొన్నారు. గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ 42 శాతం పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. బీజేపీని విమర్శించే హక్కు బీఆర్ఎస్ కు ఉండవచ్చేమో కానీ.. కాంగ్రెస్ ను విమర్శించే హక్కు మాత్రం బీఆర్ఎస్ కు లేదన్నారు. 

 

బీసీలకు అనేక అవకాశాలు కాంగ్రెస్ ఇచ్చిందని తెలిపారు. బీసీలను పీసీసీ అధ్యక్షులు చేసింది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తు చేసారు. కేసీఆర్ ధర్నా చౌక్ లేకుండా చేయాలని చూశారని.. మేము కొట్లాడి తెచ్చుకున్న ధర్నా చౌక్ ఇప్పుడు బీఆర్ఎస్ కి దిక్కు అయిందన్నారు. టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ పేరుగా మారినప్పుడే ప్రజలు ఆ పార్టీకి దూరమయ్యారని విమర్శించారు. బీసీల పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కపట ప్రేమ ఒలకబోస్తుందని.. తన తండ్రీ కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు సమగ్ర కుటుంబ సర్వే వివరాలు ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version