వైఎస్ షర్మిలకి భద్రత పెంచాలని డీజీపీని కోరిన కాంగ్రెస్ నేతలు

-

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భద్రతపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ షర్మిలకు భద్రతను పెంచాలని కాంగ్రెస్ నేతలు డీజీపీని కోరారు. ఆమెకు 1+1 భద్రత మాత్రమే కల్పిస్తున్నారని డీజీపీకి ఫిర్యాదు చేసిన నేతలు.. షర్మిలకు 4+4 భద్రత, ఎస్కార్ట్ వాహనం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో ఆమెకు 4+4 భద్రత ఉండేదని.. పీసీసీ అధ్యక్షురాలు అయ్యాక భద్రతను కుదించారని పేర్కొన్నారు.

కార్యకర్తల సమావేశాల కోసం రాష్ట్రమంతా పర్యటిస్తున్న సమయంలో అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి అని తెలిపారు. అత్యవసరంగా వైఎస్ షర్మిల కోరినట్టు.. 4+4 సెక్యూరిటీ, ఎస్కార్ట్ వాహనం ఏర్పాటు చేయాలి” అని సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ డీజీపీకి విజ్ఞప్తి చేశారు.గతంలో తెలంగాణ పోలీసులు షర్మిలకు 4+4 భద్రత కల్పిస్తే , ఏపీసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టడంతో ఇక్కడి ప్రభుత్వం 1+1 సెక్యూరిటీ ఏర్పాటు చేసింది. 4+4 భద్రత, ఎస్కార్ట్ వాహనం ఏర్పాటు చేయాలని కోరుతూ జనవరి 22న డీజీపీ రాజేంద్రనాథెడ్డికి వైఎస్ షర్మిల లేఖ రాశారు.

Read more RELATED
Recommended to you

Latest news