లోకేష్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆర్జీవి

-

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఆర్జీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ మధ్య సినిమాలను పక్కన పెట్టి.. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ లో వివాదాస్పద ట్వీట్స్ చేస్తూ కాలం గడిపేస్తున్నాడు.ఇన్నాళ్లు సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు వైసీపీకి మద్దతుగా నిలుస్తూ తెలుగు దేశం పార్టీపై విమర్శలు చేస్తున్నాడు. అవకాశాన్ని సృష్టించుకుని మరి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నాడు.తాజాగా టీడీపీ అధినేత నారా చంద్రబబు నాయుడు కుమారుడు నారా లోకేష్ ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఓ ట్వీట్ చేశారు.

ఆ ట్వీట్ లో టీడీపీ వ్యవస్థాపకులు సీనియర్ ఎన్టీఆర్ వారసుడు జూనియర్ ఎన్టీఆర్ అంతే కానీ ఈ కృత్రిమ లోకేష్ కాదు అని పోస్ట్ చేశాడు. కాగా ఈ పోస్ట్ పైన స్పందించిన జనసేన ఫ్యాన్ ఆర్జీవీ కి ధీటుగా సమాధానం ఇచ్చాడు. రాజకీయం అంటే వారసత్వం కాదని.. ఇది ఒక వ్యక్తి యొక్క ఆసక్తి, సామర్ధ్యాలు మాత్రమే అని, ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు అంటూ ఆ అభిమాని రిప్లై ఇచ్చాడు

Read more RELATED
Recommended to you

Latest news