ఎంపీ రేవంత్‌రెడ్డికి ఎట్టకేలకు కాంగ్రెస్ నాయకత్వం కలిసివస్తోంది. ఇప్పటి వరకు ఆయన టీఆర్ ఎస్ పై చేసిన ఏ ఆరోపణలకు, ఏ ఉద్యమాలకు కనీసం మాటసాయం కూడా చేయని తెలంగాణ నేతలు ఇప్పుడు ఓ విషయంలో మాత్రం ఫుల్ సపోర్టు చేస్తున్నారు. వారంతా కలిసి ఇప్పుడు ఓ మంత్రిని టార్గెట్ చేశారు. ఇంతకీ ఏ విషయం, ఎవరు ఆ మంత్రి అనే కదా మీ డౌటు. అక్కడికే వస్తున్నా ఆగండి.
మొన్న ఈటల రాజేందర్ భూ కబ్జా వ్యవహారం బయట పడటంతో.. నమస్తేతెలంగాణ పేపర్లో దేవరయంజాల్ భూముల గురించి కూడా స్టోరీ వచ్చింది. అంతే.. ఇందులోని సర్వే నెంబర్లను ఆధారంగా చేసుకుని రేవంత్‌రెడ్డి అందులో టీఆర్ ఎస్ నేతలకు భూములున్నాయని ఆరోపించారు. ముఖ్యంగా మంత్రి మల్లారెడ్డికి ఇందులో ఓ ఫామ్‌హౌస్ ఉందని, సూరారంలో చెరువు శిఖం భూములను కబ్జా చేసి కాలేజీలు కట్టారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
అయితే మొదట తనకు అక్కడ ఫామ్‌హౌస్ లేదని నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరిన మల్లారెడ్డి ఆ తర్వాత వెనక్కు తగ్గారు. అయితే రేవంత్ ఆరోపణలపై అటు కాంగ్రెస్ నాయకత్వం సపోర్టు ఇస్తోంది. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా మంత్రిపై విమర్శలు చేశారు. ఎన్ ఎస్‌యూఐ స్టూడెంట్లపై కేసులు పెట్టారంటూ ఆరోపించారు. వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అటు కాంగ్రెస్ శ్రేణులు కూడా ఈ ఉద్యమాన్ని సోషల్ మీడియాలో కొనసాగిస్తున్నారు. మరి ఈ వ్యవహారం ఎటువైపు దారి తీస్తుందో చూడాలి.