లాక్ డౌన్ పెడుతున్నారా లేదా…?: తెలంగాణా హైకోర్ట్

-

తెలంగాణాలో కరోనా కేసులు తీవ్రంగా ఉన్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్ట్ కాస్త సీరియస్ గానే మందలిస్తుంది. తాజాగా కరోనా కేసులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. లాక్ డౌన్ పెడుతున్నారా..నిబంధనలు కఠినతరం చేస్తారా అని హైకోర్ట్ ప్రశ్నించింది. కింగ్ కోటి హాస్పిటల్ లో ఆక్సిజన్ అందక 3 ముగ్గురు చనిపోయారు అని పేర్కొంది.

ఎందుకు ఆక్సిజన్ సరఫరా నిలిచి పోయిందని నిలదీసింది. కింగ్ కోటి హాస్పిటల్ పై పూర్తి వివరణ ఇవ్వాలన్న హైకోర్టు.. రాష్ట్రానికి ఎంత ఆక్సిజన్ కావాలి చెప్పాలని ప్రశ్నించింది. కేంద్రం ప్రభుత్వం ఎంత ఆక్సిజన్ రోజుకు ఇస్తుందని ప్రశ్నించింది. మేం లాక్ డౌన్ గురించి పరిశీలించండి అన్నప్పుడు అలాంటిది అవరసం లేదు అని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఎలా చెప్తారు అని హైకోర్ట్ ప్రశ్నించింది. రంజాన్ పండుగ అయ్యాక లాక్ డౌన్ పెట్టాలనుకుంటుందా ప్రభుత్వం అని హైకోర్ట్ నిలదీసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version