కాంగ్రెస్ మ్యానిఫెస్టోపై కసరత్తు నడుస్తోంది. కమిటీ చైర్మన్, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇవాళ భేటీ అయ్యారు. ఆరు గ్యారెంటీలను ఇప్పటికే ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. పూర్తి స్థాయి మ్యానిఫెస్టో తయారు చేసే పనిలో నిమగ్నమైందని సమాచారం. ఇందులో భాగంఆ ఆడపిల్ల పెండ్లి కానుకగా తులం బంగారం ఇస్తే బాగుంటదనే ప్రతిపాదనను చేసినట్టు తెలుస్తోంది. ఆడ పిల్లల పెండ్లి కానుకగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందించే రూ. లక్ష సాయంతో పాటు తులం బంగారం ఇద్దామనే ప్రతిపాదన చేసినట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సైతం సానుకూలంగా స్పందించి మేనిఫెస్టోలో పొందుపర్చడంపై సూచనప్రాయంగా అంగీకారం తెలిపినట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి.
ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం తులం బంగారం విలువ సుమారు రూ. 60 వేలకు వరకూ ఉన్నది. రానున్న కాలంలో బంగారం ధర మరింత పెరిగానా దాన్ని రూపాయలతో ముడిపెట్టకుండా బంగారం రూపంలోనే పసుపు కుంకుమగా అందించడం ద్వారా యువతులకు ప్రయోజనం కలుగుతుంది. కల్యాణలక్ష్మి ద్వారా ఇప్పుడు అందుకుంటున్న రూ. లక్షా 116 తో పాటు ఈ తులం బంగారం అదనంగా ఇవ్వాలని నిర్ణయించారు. మేనిఫెస్టోలో ఈ అంశాన్ని పొందుపర్చిన తర్వాత ఏఐసీసీ ఆమోదం తెలిపి ఫైనల్ చేయనున్నది.