రూ. 2000 నోట్లకు రేపటితో కాలం చెల్లనుందా… మళ్ళీ పొడిగిస్తారా ?

-

గతంలో మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలలో 2000 నోట్లను తీసుకురావడం కూడా ఒకటి. అయితే రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా ప్రకటించిన ప్రకారం 2000 నోట్లు విడుదల చేసిన ఉద్దేశ్యం పూర్తి అయిందని ఇక మీ దగ్గర ఉన్న నోట్లను బ్యాంకు లకు తిరిగి ఇవ్వాలంటూ కలలు వ్యవధిని నిర్ణయించింది.. ఆ ప్రకారం మాములుగా ఈ రెండు వేల నోట్లు సెప్టెంబర్ 30 వరకు మాత్రమే బ్యాంకు లలో కట్టించుకోవడం జరుగుతుంది. కానీ రిజర్వు బ్యాంకు బాగా అలోచించి ఇంకా నోట్లు రావాల్సి ఉన్నందున మరో వారం పాటు అంటే అక్టోబర్ 7వ తేదీ వరకు సమయాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. వీళ్ళు చెబుతున్న ప్రకారం ఇంకా మార్కెట్ లో రూ. 12 వేల కోట్ల రూపాయల విలువైన 2000 నోట్లు ఉన్నాయట. అందుకు నిర్ణయించిన సమయం కూడా రేపటితో ముగియనుంది..

మరి ఈ ఏడు రోజులలో ఎన్ని నోట్లు వెనుకకు వచ్చాయో ? ఇంకా ఎన్ని రావాలో చూసుకుని రిజర్వు బ్యాంకు సమయాన్ని పొడిగించాలా లేదా అన్నది ప్రకటించే ఛాన్స్ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news