ఆల్కహాల్‌ విషయంలో ఈ ఎమ్మెల్యే లాజిక్ విన్నారా?

-

కొన్ని సందర్భాల్లో కొంతమంది నాయకుల మాటలు వింటున్నా, చేష్టలు చూస్తున్నా… వీరినా మనం పాలకులుగా, మన భవిష్యత్తు నిర్ధేశకులుగా ఎంచుకున్నది అనిపించకమానదు. వీరంతా స్థానిక పరిస్థితుల నేపథ్యంలో ఏదోలా గట్టెక్కేసి ప్రజాప్రతినిధులు అయిపోతుంటారు. ఆ సంగతులు కాసేపు అలా ఉంచితే… ఈ కోవకు చెందిన ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రికి లేఖ రాశారు… ఎందుకయ్యా అంటే మద్యం విక్రయాలకు అనుమతి ఇవ్వాలని… అది కూడా మరెందుకో కాదండోయ్ ప్రజారోగ్యం కోసమేనట!

వివరాళ్లోకి వెళ్తే… రాజస్థాన్‌ లో మద్యం దుకాణాలు తెరవాలని సంగోడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ సింగ్.. సీఎం అశోక్ గెహ్లాట్‌ కు ఒక లేఖ రాశారు. అక్రమ నాటుసారా విక్రయం విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో.. ప్రభుత్వం మద్యం విక్రయాలకు అనుమతివ్వాలని ఎమ్మెల్యే తన లేఖలో కోరారు. మద్యం దుకాణాలు మూసివేయడం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వెన్నువిరిచినట్టయిందని, ఇదే సమయంలో పరిస్థితి అక్రమంగా మద్యం విక్రయాలకు దారితీసిందని ఎమ్మెల్యే లేఖలో రాశారు. అక్కడితో అయిపోతే ఇక ఈ ఎమ్మెల్యే గొప్పతనం ఏమంది చెప్పండి… ఈ కారణాలతో పాటు ఎమ్మెల్యే భరత్ సింగ్ ఓ వింత వాదనను కూడా లేఖలో ప్రస్తావించారు.

ఈ కరోనా వైరస్ సమయంలో… ఆల్కహాల్‌ కలిగిన శానిటైజర్ తో చేతులు కడుక్కోవాలని డాక్టర్లు సూచిస్తున్న సంగతి తెలిసిందే. దీత్మ్తో ఆల్కహాల్ తో చేతులు కడుక్కుంటే కరోనా వైరస్ అంతమవుతుందని చెబుతున్న నేపథ్యంలో.. మరి అదే ఆల్కహాల్ తాగడం వల్ల ఏకంగా గొంతులో ఉన్న వైరస్‌ కూడా కచ్చితంగా అంతమవుతుందని ఎమ్మెల్యే తన లేఖలో నొక్కి వక్కాణించారు! చివరి కామెంట్స్ ఇక మీ వంతు!

Read more RELATED
Recommended to you

Latest news