కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి న్యూ లుక్.. జుట్టు, గడ్డం తీసేసి..

-

సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి అంటే తెలుగు రాష్ట్రాలలో తెలియని వారు ఉండరు. అయితే ఆయన రాజకీయ రంగప్రవేశం చేసినప్పటి నుంచి గడ్డంతోనే కనిపించారు. ఆయన జుట్టు, గడ్డం ఎంతగా పెరిగిపోయినప్పటికీ, ఆయన గెటప్ మీద ఎవరు ఎన్ని రకాలుగా విమర్శలు చేసినప్పటికీ ఆయన తన గెటప్ మార్చుకోలేదు. అయితే నేడు ఆయన ఏడుకొండల వెంకన్నకి తన తలనీలాలు సమర్పించారు.

దీంతో ఆయన ఎంత మాత్రం గుర్తుపట్టలేని విధంగా మారిపోయారు. బారెడు గడ్డంతో తన మార్క్ గెటప్ తో అందరికీ పరిచితుడైన ఆయన లేటెస్ట్ గా క్లీన్ షేవ్ తో గుర్తించలేని విధంగాా మారిపోయారు. రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రజలు మాత్రమే కాదు.. సాక్షాత్తు సంగారెడ్డి ప్రజలు కూడా ఇప్పుడు ఆయన్ని గుర్తుపట్టలేరు. ఆయన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news