చెర్రీ బ్లాసమ్ ఫెస్టివల్ ని చూడాలా..? జపాన్ ఏ అవసరం లేదు… ఇండియా లో ఇక్కడ కూడా..!

-

చాలామందికి ట్రావెలింగ్ అంటే ఇష్టం. నచ్చిన ప్రదేశాలను చూసి వచ్చేయాలని అనుకుంటుంటారు. పైగా అందమైన ప్రకృతిని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు..? మ్యూజిక్ ఫెస్టివల్స్ డాన్స్ ఫెస్టివల్స్ బెలూన్ ఫెస్టివల్స్ ఇలా ఇండియాలో చాలా జరుగుతూ ఉంటాయి. అలానే చెర్రీ బ్లాసమ్ ఫెస్టివల్ కూడా మన భారతదేశంలో జరుగుతుంది.

దీన్ని చూడడానికి మనం విదేశాలకి వెళ్ళిపోకర్లేదు. జపాన్ వంటి చోట్ల ఇటువంటి ఫెస్టివల్స్ ని చేస్తూ ఉంటారు మనం అక్కడికి వెళ్లి ఎలా చూస్తాము ఎక్కువ డబ్బులు ఖర్చు అయిపోతాయి కదా ఇలా చాలా రకాల ప్రశ్నలు ఉంటూ ఉంటాయి. కానీ ఈ ఫెస్టివల్ ని చూడడానికి మనం ఇండియాలో ఉండే షిలాంగ్ వెళ్లి కూడా చూడొచ్చు. షిల్లాంగ్ చెర్రీ బ్లోసమ్ ఫెస్టివల్ ని ఈ సంవత్సరం ఘనంగా జరుపుతారు.

నవంబర్ 23 నుండి 26 వరకు నాలుగు రోజుల పాటు ఇది జరుగుతుంది. దీనితో పాటు నవంబర్ 21 నుండి 23 వరకు షిల్లాంగ్ లిటరరీ ఫెస్టివల్ కూడా జరగనుంది. గులాబీ-తెలుపు పువ్వులతో ఎంతో అందంగా ఉంటుంది. దీన్ని చూసేందుకు చాలా మంది పర్యాటకులు తరలి వెళ్తారు. పోలో గ్రౌండ్‌లో ఇది జరుగుతుంది. ఈ ప్రదేశం అంతా కూడా పైన్ చెట్లు, చెర్రీ పువ్వులు అందంగా ముస్తాబై ఉంటుంది. ఫెస్టివల్‌లో మంచి ఆహారం, లోకల్ వైన్, మంచి సంగీతం ని కూడా పొంది ఎంజాయ్ చేసేయచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news