కారెక్కనున్న ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు!

-

తెలంగాణ ఎన్నిలకల్లో ఇప్పటికే చావు దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీకి మరో గట్టి దెబ్బతగలనుంది. ఇందులో భాగంగా హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కారెక్కెందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. మాజీ హోంమంత్రి, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సహా ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అధికార తెరాస లో చేరేందుకు ఆ పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారని ప్రచారం సాగుతోంది. అయితే దాదాపు సంక్రాంతి తర్వాత ఈ చేరికలు ఉంటాయని, ఆ తరువాత మరో నలుగురైదుగురు రెండో విడతలో తెరాసలో చేరతారని విశ్వసనీయ సమాచారం.

మొదటి విడత పార్టీలో చేరతారని భావిస్తున్న సబితా ఇంద్రారెడ్డికి రెండో విడత మంత్రివర్గ విస్తరణలో అవకాశం లభిస్తుందని, ఏ కారణం వల్ల అయినా ఆ చాన్స్‌ దక్కకపోతే ఆమె కుమారుడు కార్తీక్‌రెడ్డికి చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం టికెట్‌ ఇస్తారని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే తెరాసలో నుంచి ఎంపీ పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ లోకి వెళ్లిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి స్థానం ఖాళీ అవ్వడంతో ఆ స్థానం నుంచి కార్తీక్‌కు సీటు ఇచ్చేందుకు అధిష్టానం మెగ్గు చూపుతున్నట్లు సమాచారం. అలాగే ఎల్బీ నగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తెరాసలో చేరడం కూడా దాదాపుగా ఖాయమైందని అంటున్నారు.. భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి, నిజామాబాద్‌ జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జె. సురేందర్‌ లు సైతం కారు వైపే చూస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇదేగనుక జరిగితే ఇక తెలంగాణలో కాంగ్రెస్ మనుగడ మరో రెండు దశాబ్దాల పాటు కష్టమనే చెపొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news