ఈనెల 25న కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ భేటీ….

-

పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్దమవుతున్నాయి. కేంద్రాన్ని ఇరుకున పెట్టే విధంగా ప్రతిపక్షాలు ప్రజా సమస్యలను లేవనెత్తనున్నాయి. ఈనెల 28న అంటే పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ఒక రోజు ముందు కేంద్రం ఆధ్వర్యంలో ఆల్ పార్టీ మీటింగ్ కూడా జరుగనుంది. ఆల్ పార్టీ మీటింగ్ కు ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరవుతారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ప్రజా సమస్యలపై గొంతెత్తెందుకు వ్యూహాలను రూపొందిస్తుంది.

తాజాగా కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ ఈనెల 25న భేటీ కానుంది. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి చర్చించనున్నారు. ముఖ్యంగా మూడు వ్యవసాయ బిల్లుల రద్దుతో పాటు ఎంఎస్పీ హామీ బిల్లు, నూతన విద్యుత్ బిల్లు మొదలైన రైతు సమస్యలపై కాంగ్రెస్ గళం విప్పనుంది. దీంతో పాటు ద్రవ్యోల్బణం, దేశ ఆర్థిక వ్యవస్థల అంశాన్ని కాంగ్రెస్ సమావేశాల్లో ప్రస్తావించనుంది. నవంబర్ 29 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news