చెరుకు ముత్యంరెడ్డి తనయుడికి కాంగ్రెస్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. కాంగ్రెస్ లో చేరితే దుబ్బాక టిక్కెట్ తనకే అంటూ సంకేతాలు పంపినట్టు తెలుస్తోంది. దీంతో చేప్యాలలోని తన ఫామ్ హౌస్ లో తన అనుచరులరో చెరుకు శ్రీనివాస్ రెడ్డి సమావేశం అయినట్టు సమాచారం. ఇక ఈరోజు ఉదయం వరకు డిసిసి అధ్యక్షులు నర్సారెడ్డి నే అభ్యర్థిగా ప్రకటించాలని పిసిసి నిర్ణయం తీసుకున్నా చివరి నిముషంలో చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు చెరువు శ్రీనివాస్ రెడ్డితో కాంగ్రెస్ సంప్రదింపులు జరపడం ఆసక్తికరంగా మారింది.
నిజానికి గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి పేరు దాదాపు ఖరారైంది. అధిష్టానం ఆమోదం పొందిన మరుక్షణం ఆయన పేరును ప్రకటించనున్నారని అనుకున్నా చివరి నిముషంలో రాజకీయం మారింది. అందుకు తగ్గట్టుగానే చెరుకు శ్రీనివాసరెడ్డి కూడా ఉమ్మడి మెదక్ జిల్లా నేతలతో టచ్లోకి వచ్చినట్టు చెబుతున్నారు. దుబ్బాక ఎన్నికల్లో తన పేరు అభ్యర్థిగా ముందు ప్రకటిస్తే పార్టీ లోకి వస్తానని చెరుకు శ్రీనివాసరెడ్డి షరతులు పెట్టినట్టు తెలుస్తోంది. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహతో రహస్య మంతనాలు జరుపుతున్నట్టు చెబుతున్నారు.