మూడో విడత ‘తెరా:’ కాంగ్రెస్

-

తెలంగాణ కాంగ్రెస్ 13 మంది అభ్యర్థులతో మూడో జాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పోటీ విషయంలో శుక్రవారం అర్ధరాత్రి తర్వాత సందిగ్ధత వీడిన విషయం తెలిసిందే. నామినేషన్ల ఆఖరి రోజు గడువు సమీపిస్తుండటంతో మహాకూటమి స్పీడు పెంచింది. అసమ్మతి నేతలను బుజ్జగించి క్రమంగా ఒక్కొక్కరిని లైన్లోకి తెచ్చుకుంటూ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. ఈ 13 మందితో కలిపి ఇప్పటి వరకు మొత్తం 88 మందిని కాంగ్రెస్ ప్రకటించింది.

అభ్యర్థుల వివరాలు..

జనగామ – పొన్నాల లక్ష్మయ్య
భోథ్‌(ఎస్టీ)- సోయం బాపురావు
నిజామాబాద్‌ అర్బన్‌-తాహెర్‌ బిన్‌ హమ్దాన్‌
నిజామాబాద్‌ రూరల్‌ – డా. రేకుల భూపతి రెడ్డి
బాల్కొండ- ఈ. అనిల్‌కుమార్‌
ఎల్బీనగర్‌ -డి. సుధీర్‌రెడ్డి
కార్వాన్‌-ఉస్మాన్‌ బిన్‌ మహ్మద్‌ అల్‌ హజారి
యాకత్‌పురా- కె. రాజేందర్‌ రాజు
బహదూర్‌పుర – కలేం బాబా
కొల్లాపూర్‌ – బీరం హర్షవర్ధన్‌రెడ్డి
దేవరకొండ(ఎస్టీ)- బాలునాయక్‌
తుంగతుర్తి(ఎస్సీ)-అద్దంకి దయాకర్‌
ఇల్లందు(ఎస్టీ)- బానోత్‌ హరిప్రియ నాయక్‌

 

Read more RELATED
Recommended to you

Latest news