నన్ను ఆశీర్వదించు తాతా…

-

నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు.  బాబాయి బాలకృష్ణ, కుటుంబ సభ్యులతో కలిసి ఎన్టీఆర్‌ ఘాట్‌కి చేరుకుని తాత నందమూరి తారక రామారావుకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సుహాసిని మాట్లాడుతూ… కుటుంబ సభ్యుల ఆదరణ, ప్రోత్సాహంతో తాను రాజకీయాల్లో పోటీ చేయడానికి సిద్ధమయ్యానని తెలిపారు.  తాతా ఎన్టీఆర్, తండ్రి హరికృష్ణ లతో పాటు మావయ్య చంద్రబాబు, బాబాయి బాలకృష్ణ, తెతెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ, కూటకట్ పల్లి నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో తతను గెలిపించాలని కోరారు.

అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ…మొదటి సారిగా మా కుటుంబం నుంచి ఆడపడుచుని రాజకీయాల్లోకి దించాం… అత్యధిక మెజార్టీతో సుహాసినిని గెలిపించి హరికృష్ణకు నివాళులర్పించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా మహా కూటమి ప్రభంజనం కొనసాగుతోంది..తెలంగాణలో కూటమి విజయం సాధిస్తుందని బాలయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం ఎన్టీఆర్ ఘాట్ నుంచి మహా ప్రస్థానంలోని తన తండ్రి హరికృష్ణకు నివాళులర్పించి నామినేషన్ వేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news