ఇప్పుడు కండ్ల కలకలు అందర్నీ భయపెడుతున్నాయి. చాలా మంది ఈ ఇబ్బందితో బాధపడుతున్నారు. దాంతో కొన్ని స్కూళ్ళకి, సెలవులు కూడా ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఈ సీజన్లో కండ్ల కలకలు రాకుండా ఉండాలంటే, కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సీజన్లో ఎక్కువగా వస్తాయి. కాబట్టి కండ్ల కలకలు వచ్చినవాళ్లు కచ్చితంగా వీటిని పాటించాలి. వర్షాకాలంలో కండ్లకలకలు సహజం విశాఖ జిల్లాలో కేసులు బాగా పెరిగిపోతున్నాయని నిపుణులు అంటున్నారు.
వాతావరణం లో మార్పులు వలనే కండ్ల కలకలు రావడం జరుగుతుంది కళ్ళు ఎరుపు రంగులోకి మారడం, కళ్ళు దురద పుట్టడం, రోజంతా నీటితో నిండిన కళ్ళు కనపడడం, కండ్ల కలకలతో బాధపడుతున్నప్పుడు కచ్చితంగా హోమియోపతి కోర్సు తీసుకోవాలి. అప్పుడు వెంటనే తగ్గుతుంది. కండ్ల కలకలు వచ్చినప్పుడు, ఇంట్లోనే సాధారణ నివారణలు పాటిస్తూ తగ్గించుకోవచ్చు. ఎక్కువగా ఉన్నట్లయితే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయడం మంచిది త్వరగా లక్షణాలు గుర్తించి మీరు వైద్యుడిని సంప్రదిస్తే పెద్దగా ప్రమాదం ఏమీ ఉండదు.
కండ్ల కలకలు వచ్చినట్లయితే పదే పదే కళ్ళని ముట్టుకోవడం మంచిది కాదు అలానే రుద్దడం కూడా మంచిది కాదు. ఇలా చేయడం వలన కంటికి ఇబ్బంది మరింత ఎక్కువవుతుంది. కండ్ల కలకలతో బాధపడే వాళ్ళు వారి యొక్క మేకప్ సామాన్లు ఇతరులతో పంచుకోకూడదు ఐ డ్రాప్స్ తువ్వాలు దుప్పటి వంటివి ఇతరులకు ఇవ్వకండి. లెన్స్ ఐ గ్లాసులు వంటివి కూడా షేర్ చేసుకోవడం మంచిది కాదు. కంటికి సంబంధించిన ప్రొడక్ట్స్ కాటుక వంటి వాటిని కూడా ఇతరులతో పంచుకోకండి.
ఇన్ఫెక్ట్ అయిన వాళ్ల వస్తువులు మరొకరికి ఇవ్వడం వలన వాళ్ళు కూడా ఈ సమస్యతో ఇబ్బంది పడాల్సి వస్తుంది మీ కళ్ళని పదే పదే ముట్టుకోవద్దు. చేతుల్ని ఎక్కువసార్లు కడుక్కుంటూ ఉండండి. ఒక మంచి శుభ్రమైన తువ్వాలని ఉపయోగించండి. మీ టవల్ ని మరొకరికి ఇవ్వకండి కేవలం ఈ ఒక్క సమస్య ఉండి జలుబు జ్వరం వంటి ఇతర లక్షణాలు ఏమీ లేకపోతే మీరు మీ పని చేసుకోవచ్చు. కానీ దీనితో పాటుగా ఇతర లక్షణాలు ఉంటే మాత్రం స్కూల్ కాలేజీ లేదా వర్క్ ప్లేస్ కి వెళ్లడం మంచిది కాదు. అలానే ఇతరులకి బాగా దగ్గరగా ఉండటం వలన వారికి కూడా ఇది సోకుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.