ఆహారం తీసుకునేటప్పుడు ఆల్కహాల్ ని తీసుకుంటే డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది: స్టడీ

-

ఆహారం తీసుకునేటప్పుడు ఆహారంతో పాటు వైన్ తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి అని స్టడీ చెబుతోంది. టైప్ 2 డయాబెటిస్ రిస్కు తగ్గడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. అయితే మరి స్టడీ ఏం చెబుతోందో ఇప్పుడు చూద్దాం. తులానే యూనివర్సిటీ చేసిన స్టడీ ప్రకారం కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి.

రోజు ఆహారంతో పాటు ఈ విధంగా ఆల్కహాల్ ని తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ తగ్గుతుందని స్టడీ చెబుతోంది. పైగా దీనితో ఆరోగ్యం బాగుంటుంది. అదే విధంగా అనారోగ్య సమస్యలు దరి చేరవు. నిజానికి ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాని లిమిట్ గా తీసుకోవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి.

పురుషులు రోజుకు రెండు గ్లాసులు, మహిళలు ఒక గ్లాసు తీసుకుంటే ఆరోగ్యం మెరుగు పడుతుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్, సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఏం చెబుతోందంటే ఆల్కహాల్ అలవాటు లేని వాళ్ళు ఆల్కహాల్ ని మొదలు పెట్టకూడదని చెబుతోంది.

కొంత మంది అయితే అసలు తీసుకోకూడదని ముఖ్యంగా గర్భిణీలు దీనికి దూరంగా ఉండాలి అని చెబుతోంది. ఆహారం తీసుకునేటప్పుడు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల 14 శాతం డయాబెటిస్ తగ్గుతుందని తెలుస్తోంది. ఆహారం తీసుకోకుండా ఆల్కహాలు తీసుకున్న దానితో పోల్చుకుంటే 14 శాతం డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది. కాబట్టి ఇలా ఆహారం తీసుకునేటప్పుడు ఆల్కహాల్ ని తీసుకుంటే డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news