బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ పుట్టిన రోజు వేడుకలపై వివాదం

గుంటూరు : నేడు హిందూ పూరం ఎమ్మెల్యే , టాలీవుడ్‌ స్టార్‌ హీరో బాలకృష్ణ కుమారుడు మోక్షగ్న పుట్టిన రోజు అన్న సంగతి తెలిసిందే. దీంతో టీడీపీ నేతలతో పాటు హిందూ పురం లో కోలాహలం నెలకొంది. అటు గుంటూరు జిల్లా లోని విజ్ఞాన్ యూనివర్సిటీ వద్ద బాలకృష్ణ కుమారుడు మోక్షగ్న పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. విజ్ఞాన్ యూనివర్సిటీ ఎదుట విద్యార్థులు కేక్ కట్ చేశారు.

Mokshagna Teja To Act in Sangeetham direction

అయితే.. ఈ నేపథ్యం లోనే కరోనా ఆంక్షలు ఉన్నాయంటూ నిషేధాజ్ఞలు జారీ చేశారు పోలీసులు. అయినా విద్యార్థులు… పోలీసులకు ఆంక్షలను పట్టించు కోలేదు. దీంతో పోలీసులకు మరియు విద్యార్థులకు మధ్య వాగ్వాదం చేల రేగింది.. విద్యార్థుల ను చెదర గొట్టేందుకు లాఠీ ఛార్జ్ చేశారు పోలీసులు. అయితే… ఈ ఘటనపై టీడీపీ పార్టీ సీరియస్‌ అయింది. విద్యార్థుల మీద లాఠీఛార్జ్ చేయడం పై టిడిపి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జగన్‌ డైరెక్షన్‌ లోనే ఈ దాడులు జరుగుతున్నాయని మండి పడుతున్నారు.