విగ్‌తో అమ్మాయిలకు బురిడి…పెళ్లి పేరుతో 30 మందికి మోసం

తిరుపతి లో సాఫ్ట్‌ ఉద్యోగం పేరుతో దారుణాలు పాల్పడ్డాడు ఓ యువకుడు. విగ్గు పెట్టుకుని మరీ.. మహిళలను ట్రాప్‌ చేశారు. పెళ్ళి చేసుకుంటానని మోసం చేస్తూన్న ఈ మాయలోడిని ఇవాళ పోలీసులు అరెస్టు చేశారు. పెళ్ళి, ఉద్యోగాల పేరు తో యువతులకు కోట్లాది రూపాయలు టోకరా వేస్తున్నాడు శ్రీనివాస్ అనే యువకుడు. ఏకంగా 30 మంది అమ్మాయిలను పెళ్ళి పేరుతో మోసం చేశాడు శ్రీనివాస్.

ఏపి, తెలంగాణా, తమిళనాడు, మహరాష్ట్ర, కర్ణాటక సహా పలు రాష్ట్రాలలోని యువతులను మోసం చేశాడు శ్రీనివాస్. బట్ట గుండు ఉండటంతో అందంగా కనిపించేందుకు… విగ్గు పెట్టుకుని మహిళలను ట్రాప్‌ చేశాడు. పెళ్ళి పేరుతో మోసం చేసి వచ్చిన డబ్బులతో అన్ లైన్ లో గంజాయి వ్యాపారం చేస్తున్నాడు శ్రీనివాస్. అలా వచ్చిన డబ్బంతా స్టాక్ట్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టాడు. అయితే…శ్రీనివాస్‌ గురించి అసలు తెలుసుకున్న …. చిత్తురుకు చెందిన మహిళ.. చిత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలో దిగిన పోలీసులు… ఆ కేటుగాడిని అరెస్టు చేశారు. శ్రీనివాస్ ను ప్రకాశం జిల్లా అద్దంకి చెందిన వాడిగా పోలీసులు విచారణ గుర్తించారు. ప్రస్తుతం శ్రీనివాస్‌ చిత్తూరు పోలీసుల అదుపులో ఉన్నాడు.