బాలీవుడ్ కూలీ నెం. 1 నెలకొల్పిన అత్యంత చెత్త రికార్డు..

-

కరోనా కారణంగా సినిమాలన్నీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ద్వారానే విడుదల అవుతున్నాయి. బాలీవుడ్ లో ఇది మరింత జోరుగా ఉంది. ఐతే ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలకి సక్సెస్ రేట్ చాలా తక్కువే ఉంది. తాజాగా బాలీవుడ్ లో కూలీ నెం. 1 సినిమా విడుదలైంది. వరుణ్ ధావన్, సారా ఆలీ ఖాన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి నెగెటివ్ రివ్యూస్ వచ్చాయి. ముఖ్యంగా ఈ సినిమాపై సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వచ్చాయి. పాతకాలం నాటి కథతో ఓవర్ యాక్షన్ మరీ ఎక్కువైందని అనేక విమర్శలు చేస్తున్నారు.

ఐతే తాజాగా కూలీ నెం. 1 సినిమా రికార్డుని క్రియేట్ చేసింది. ఐఎమ్ డీబీలో ఈ సినిమాకి 1.3రేటింగ్ వచ్చింది. ఇంత తక్కువ రేటింగ్ క్రియేట్ చేసిన రెండవ బాలీవుడ్ చిత్రంగా నిలిచింది. అంతకు ముందు ఆలియా భట్ నటించిన సడక్ 2 1.1రేటింగ్ తెచ్చుకుని మొదటి స్థానంలో ఉంది. ఐతే అత్యంత తక్కువ రేటింగ్ తెచ్చుకున్న రెండు సినిమాలు కూడా రీమేక్ లు కావడం గమనించదగ్గ విషయం.

Read more RELATED
Recommended to you

Latest news