2020లో ప్రముఖ వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ అనేక ఘనతలు సొంతం చేసుకున్నారు. పక్క ప్రణాళికలతో ముందుకెళ్లడంతో తన సంస్థలో శరవేగంగా గమ్యాలను చేరుకున్నాయి. దీంతో సంస్థలు పుంజుకొని రిలయన్స్ ఇండస్ట్రీస్ రుణరహిత కంపెనీగా ఆవిర్భవించింది. డిజిటల్ సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్‌లో దాదాపుగా 33 శాతం వాటా విక్రయంతో ముకేశ్ 1.5 లక్షల కోట్లకు చేరింది. ప్రపంచ కుబేరుల జాబితాలోనూ టాప్5లోకి దూసుకెళ్లారు.
మీడియా రంగంలోనూ..
రిలయన్స్ ఇండస్ట్రీస్ 2020లో ప్రధానంగా రిలయన్స్ జియో ద్వారా వ్యవస్థలు, గూప్ వ్యాపారాలలోనూ భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. మీడియా రంగంలో పట్టు సాధించేందుకు కసరత్తులు చేపట్టింది. దీంతో 2021లో 5జీ టెక్నాలజీని అందుకోవడంలోనూ ఆ సంస్థ ముందుంటుందని విశ్లేషకులు అంటున్నారు.
డిజిటల్‌వైపు..
5జీ నెట్‌వర్క్‌కు సంబంధించిన సర్వీసుల అభివృద్ధిపై దృష్టి సారించాల్సి ఉంది. ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్ పేమెంట్ సౌకర్యాలను రిలయన్స్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌కు అనుసంధానించడంతో ఈకామర్స్ వ్యాపారానికి మద్దతివ్వాల్సి ఉంది. దేశవ్యాప్తంగా రిలయన్స్ రిటైల్ పలు స్టోర్లను ఏర్పాటు చేసింది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలను ఈకామర్స్‌లో భాగం చేసేందుకు వీలుగా టెక్నాలజీ సొల్యూషన్స్, యాప్‌లను ఆవిష్కరించాల్సి ఉంది. ఈ సమయంలోనే దేశీం రిటైల్ రంగంపై కన్నేసిన వాల్‌మార్ట్, అమెజాన్ సంస్థల నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకోవాల్సి ఉంటుంది.