ఏపీలో క‌రోనా విజృంభ‌ణ.. నేడు 1,831 కేసులు

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ విజృంభిస్తుంది. నిన్న‌టితో పోలిస్తే.. నేడు ఏకంగా 100 శాతం క‌రోనా కేసులు పెరిగాయి. నేడు ఆంధ్ర ప్ర‌దేశ్ లో 1,831 క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయ‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఆంధ్ర ప్ర‌దేశ్ లో ఒక్క రోజు వ్య‌వ‌ధిలో ఇంత మొత్తంలో క‌రోనా కేసులు నమోదు కావడం గ‌త ఆరునెల‌లో ఇదే మొద‌టి సారి. సోమవారం ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో 984 కేసులు న‌మోదు అయ్యాయి.

అంటే నిన్న‌టితో పోలిస్తే నేడు రాష్ట్రంలో దాదాపు 100 శాతం క‌రోనా కేసులు పెరిగాయి. ఒక్క రోజులో రాష్ట్రంలో ఇన్ని కేసుల న‌మోదు కావ‌డంతో రాష్ట్ర ప్ర‌జ‌లు, వైద్య ఆరోగ్య అధికారులు అందోళ‌న చెందుతున్నారు. కాగ రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి ఎక్కువ ఉన్న నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే నైట్ క‌ర్ఫ్యూ ను అమలు చేస్తుంది. ఆంధ్ర ప్ర‌దేశ్ లో ఈ నెల 18 నుంచి నైట్ క‌ర్ఫ్యూ అమ‌ల కానుంది. రాత్రి 11 గంట‌ల నుంచి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు నైట్ క‌ర్ఫ్యూ అమ‌లులో ఉంటుంది.

 

కాగ ఈ నెలలో వ‌చ్చే సంక్రాంతి పండుగ ఎఫెక్ట్ క‌రోనా పై చూపే అవ‌కాశం ఉంది. దీంతో పండ‌గ రోజుల్లో క‌రోనా కేసులు ఎక్కువ రాకుండా ఉండాల‌ని ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేస్తుంది. కాగ నేటి క‌రోనా కేసుల‌తో రాష్ట్రంలో ప్ర‌స్తుతం 7,195 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news