కరోనా వచ్చింది.. పోయింది కానీ వాళ్ళకి తెలియదు.. ఇదో రకం వైరస్..?

-

ఆంధ్రప్రదేశ్‌లోని 4 జిల్లాల్లో జరిగిన సిరో సర్వైలెన్స్ ఫలితాలపై విశ్లేషణ జరుగుతోంది. ఎంపిక చేసిన వ్యక్తుల్లో 3,750 మంది నుంచి రక్త నమూనాలు సేకరించారు. పట్టణాలు/ నగరాల్లో 30 % , గ్రామీణ ప్రాంతాల్లో 70 % చొప్పున ఈ నమూనాలు తీసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే నమోదైన కేసులు, వయసు, పురుషులు, మహిళల కేటగిరి, ఇతర ప్రమాణాల ప్రకారం ఇప్పటి వరకు వైరస్ సోకని వారి నుంచి మాత్రమే ఈ సేకరణ జరిగింది. వీరి రక్త నమూనాలను క్లియా మిషన్ల ద్వారా పరీక్షించారు. దీని ప్రకారం కృష్ణా జిల్లాలో సుమారు 20 % మందికి వైరస్ సోకి .. వెళ్లిపోయినట్లు తెలిసింది. తూర్పు గోదావరి జిల్లాలో 15 %, నెల్లూరు జిల్లాలో 9 % , అనంతపురం జిల్లాలో 12 % నుంచి 14 % మందికి వైరస్ సోకింది. వీరెవరికీ వైరస్ వచ్చి వెళ్లినట్లు తెలియదు. ఈ ఫలితాలను శాస్త్రీయ పద్ధతిలో విశ్లేషిస్తున్నారు.

Carona
Carona

కృష్ణా జిల్లాలో నమోదవుతోన్న కేసులకు తగ్గట్లుగానే ‘సిరో సర్వైలెన్స్’ ఫలితాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. నమూనాల సేకరణ జరిగిన ప్రాంతాల వారీగా పరిశీలిస్తే .. ఒక్కొక్కచోట 20 % కంటే ఎక్కువ మందికి వైరస్ సోకి, వెళ్లినట్లు గుర్తించారు. వీరితో పాటు వైరస్ నిర్ధారణ పరీక్షల ద్వారా పాజిటివ్‌గా తేలిన వారిని మినహాయిస్తే.. మిగిలిన వారిలోనే వైరస్ ఒకరి నుంచి మరొకరికి సంక్రమించాలి. దీని ప్రకారం కృష్ణా జిల్లాలో వైరస్ సంక్రమణ తక్కువగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఫలితాల విశ్లేషణ పూర్తయిన అనంతరం మిగిలిన జిల్లాల్లో ప్రారంభించాలని వైద్యారోగ్య శాఖ యోచిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news