ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు భారీగానే నమోదు అవుతున్నాయి. కరోనా కట్టడికి చర్యలు చేపట్టినా సరే పెద్దగా ఫలితం మాత్రం కనపడటం లేదు. ఇక ఆర్మీ కూడా ఆంధ్రప్రదేశ్ కి తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తుంది. తాజాగా రాష్ట్రంలో క్షేత్రస్థాయి కొవిడ్ పరిస్థితుల ఆరాకు ప్రత్యేక బృందంను ఆర్మీ రంగంలోకి దించింది. విశాఖపట్నం నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నౌకాయాన బృందం చేరుకుంది.
కృష్ణతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో అత్యవసర ప్రాణవాయువు అవసరత, ఇతర అంశాలపై అధ్యయనం చేస్తారు. రూపొందించిన నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయనున్నట్లు తెలుస్తుంది. విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ వెళ్లిన బృందం… అధ్యయనం చేస్తుంది. రానున్న రెండ్రోజుల్లో తొలుత కృష్ణ, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.