తెలంగాణపై కరోనా పంజా.. వెయ్యి దాటిన రోజువారీ కేసులు

-

తెలంగాణలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా రోజువారీ కేసుల సంఖ్య వెయ్యి మార్క్‌ను దాటింది. గడిచిన 24 గంటల్లో 43,318 మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా.. కొత్తగా 1,061 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది.

నిన్న మహమ్మారి నుంచి 836 మంది బాధితులు పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,357 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. అత్యధికంగా హైదరాబాద్‌లో 401 కేసులు, రంగారెడ్డిలో 63, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 56, నల్గొండ 51, రాజన్న సిరిసిల్ల 46, కరీంనగర్‌ 43 కేసులు వెలుగుచూశాయి.

మరోవైపు.. నల్గొండ జిల్లా నేరేడుగొమ్ము కస్తుర్బా పాఠశాలలో కరోనా కలకలం కరోనా కలకలం రేపింది. ఉదయం విద్యార్థులు జ్వరం, దగ్గుతో బాధ పడుతుండటంతో అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది వైద్య శాఖ అధికారులకు తెలియజేశారు. దీంతో వైద్య సిబ్బంది కస్తూర్బా పాఠశాలకు వచ్చి 20మంది విద్యార్థినులకు కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. వీరిలో 16మంది విద్యార్థినులకు, ఒక ఉపాధ్యాయురాలికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

దీంతో ప్రిన్సిపల్ గీత విద్యార్థినుల తల్లిదండ్రులకు ఫోన్‌లో సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకున్నారు. ప్రస్తుతం నేరేడుగొమ్ము కస్తుర్బా పాఠశాల దేవరకొండలో కొనసాగుతుంది. మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. నిన్న తాజాగా 992 కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 8,22,663కు పెరిగింది. హైదరాబాద్​లో 376కేసులు నమోదయ్యాయి. హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్ కుమార్​కు కొవిడ్ పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version