బాలయ్యా.. హిందూపురం న్యూస్ విన్నావా?

-

ప్రస్తుతం ఏపీ మొత్తం రోజు రోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. టెస్టుల సంఖ్య పెరగడం దీనికి ఒక కారణం కాగా… పనిలేకున్నా బయటకువస్తున్న వారి సంఖ్య పెరగడం కూడా మరోకారణంగా చెబుతున్నారు. ఈ విషయంలో రెండు రాష్ట్రాలూ పోటీ పడుతుండటంతో… తెలుగు ప్రజలకు ఈ మహమ్మారి నుంచి విముక్తి ఇప్పట్లో కలిగేలా కనిపించడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కర్నూలు, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, చిత్తూరు ల తర్వాత అదే దిశలో దూసుకుపోతుంది అనంతపురం జిల్లా!

అనంతపురంలో రోజురోజుకీ పాజిటివ్‌ కేసులు పెరిగిపోతుండటంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ఈ జిల్లాలో నమోదైన 36 పాజిటివ్ కేసుల్లో… 20 కేసులు హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోవే కావడంతో ఆ నియోజకవర్గ ప్రజల టెన్షన్ మరింతగా పెరిగింది. దానికి కారణం… పట్టణంలో ఇప్పటికే ఏడు ప్రాంతాలను రెడ్‌ జోన్లుగా ప్రకటించడం కూడా! అంటే సుమారుగా హిందూపురం మున్సిపాలిటీ 75 శాతం రెడ్‌ జోన్‌ లో ఉన్నట్లే! ఈ పరిస్థితుల్లో ఆ ప్రాంతాల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో నిత్యావసర సరుకులు, కూరగాయలు, పాలు, పండ్లు, మెడిసిన్‌ ఇలా ఏది కావాలన్నా.. బయటి వ్యక్తులు, ప్రభుత్వం నియమించిన గ్రామ, వార్డు వాలంటీర్లే దిక్కుగా ఉన్న పరిస్థితి!

ఈ క్రమంలో నియోజకవర్గ ఎమ్మెల్యే బాలయ్యను గుర్తుకు తెచ్చుకుంటున్నారు ఆ ప్రాంత ప్రజలు! ఈ సమయంలో సహాయకార్యక్రమాలు విపరీతంగా అవసరం ఉన్న ఈ ప్రాంతం విషయంలో స్థానిక ఎమ్మెల్యే స్పందించాలని పలువురు అభిప్రాయపడుతున్నారట! ఈ సమయంలో బాలయ్య ఏ విధంగా రెస్పాండ్ అవుతారనే విషయంపై హిందూపురం నియోజకవర్గ ప్రజలతోపాటు.. బాలయ్య అభిమానులు ఎదురుచూస్తున్నారట!! కాగా… ఇలా రోజు రోజుకీ కరోనా పాజిటివ్ కేసులు అధికమవుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా బాధితులు, వారు కాంటాక్ట్‌ అయినవారిని గుర్తించి వారిని క్వారన్‌ టైన్‌ ను తరలిస్తున్నారు!

Read more RELATED
Recommended to you

Latest news